Home / పవన్ టుడే / జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలపై వైసీపీ రౌడీలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు..రాళ్లు, కర్రలతో పోలీసుల సమక్షంలోనే ఈ దాడులకు పాల్పడ్డారు.. జనసేన నాయకులు, కార్యకర్తలకు గాయాలు అయ్యేంత వరకు చూస్తూ ఊరుకున్న పోలీసులు, ఆ తర్వాత జనసైనికుల్ని అక్కడి నుంచి పంపించి వేశారు.. ఈ దాడులు జనసేన వీర మహిళలపై కూడా సాగాయి.. దాడుల్లో గంటా స్వరూపాదేవి, ప్రియా సౌజన్య, మానసలతో పాటు పలువురు మహిళా నాయకులు గాయపడ్డారు.. అంతేకాదు తీవ్రమైన అసభ్య పదజాలంతో మహిళా నాయకుల్ని అక్కడ ఉన్న వైసీపీ మూకలు దూషించడం కూడా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు..

అనంతరం దాడుల్లో గాయపడిన వీర మహిళలను చికిత్స నిమిత్తం జీజీహెచ్ కి తరలించగా., వైసీపీ శ్రేణులు వారిని రెచ్చగొట్టే క్రమంలో ముందస్తు పన్నాగం సిద్ధం చేశాయి.. సందీప్ పంచకర్ల అండ్ కోపై ఎవరైదా భౌతిక దాడులకు పాల్పడ్డారో, మహిళా నాయకురాళ్లను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారో అతడిని ముందుగానే చికిత్స పేరుతో జీజీహెచ్ లో ఉంచారు.. తమపై దాడి చేసి చికిత్స పేరుతో ఆ వైసీపీ రౌడీ అక్కడ కనబడడంతో జీజీహెచ్ కి వెళ్లిన మహిళా నాయకులు తట్టుకోలేకపోయారు.. ఒకింత ఆగ్రహానికి లోనై తమను దూషించినందుకు గాను అతనిపై దాడికి యత్నించారు.. ఇక్కడే పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా తాము ఏం చేయాలో చేశారు.. ఆ వైసీపీ రౌడీ మీద దాడి జరగకుండా కాపాడడంతో పాటు మహిళా నాయకులు దాడి చేసినట్టు, ఆ దాడిలో అతను తీవ్రంగా గాయపడినట్టు చిత్రించారు.. సెక్షన్ 307 ప్రయోగించి హత్నాయత్నం అంటూ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు..

ఘటన అనంతరం జనసేన పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ కి చెందిన క్లబ్ లో జనసేన నాయకులు, కార్యకర్తలు సమాశం అయ్యారు. దాడి ఘటనకు సంబంధించి చర్చించుకుంటుండగా., ఓ బెటాలియన్ పోలీసులు అక్కడికి వచ్చి అక్రమంగా 50 మందికి పైగా నాయకుల్ని అరెస్ట్ చేశారు.. కాకినాడ పరిసరాల్లో ఎక్కడా వారిని ఉంచకుండా తొండంగి పోలీస్ స్టేషన్ కి తరలించారు.. అందరి మీద అక్రమంగా ఇష్టారాజ్యంగా కేసులు బనాయించారు.. జనసేన కార్యకర్తల మీద వైసీపీ ఎమ్మెల్యే తెచ్చిపెట్టుకున్న రౌడీలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడగా., ఖాకీలు మాత్రం ఈ ఘర్షణల్లో ఐదుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారని చెబుతుండడం పోలీస్ యంత్రాంగం పని తీరుకి అద్దం పడుతోంది.. జనసేనాని సూచనతో లీగల్ విభాగం రంగంలోకి దిగింది..

అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పరిణామాలపై ప్రతి నిమిషానికీ రిపోర్టు తెప్పించుకున్నారు. అక్రమంగా కేసులు బనాయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. తూర్పు గోదావరి జిల్లా పోలీసులకు ట్విట్టర్ వేదికగా తీవ్ర హెచ్చరికలు పంపారు.. దాడులకు పాల్పడిన వైసీపీ నాయకులను వదిలేసి., తమ పార్టీ నేతల మీద 307 సెక్షన్ కింద కేసులు పెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అదే పరిస్థితి కొనసాగితే తాను ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ రావాల్సి వస్తుందనీ, తర్వాత పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరించారు.. జనసేనాని హెచ్చరికల నేపధ్యంలో అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసిన వారిని విడుదల చేశారు.. అయితే కేసులు తొలగించారా? లేదా అన్న విషయం తెలియరాలేదు..

జనసేన నాయకుల విడుదల తర్వాత ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అందరికీ ధైర్యం చెప్పారు.. మీకు నేనున్నానంటూ ఆయన చెప్పిన మాటలు ఉదయం నుంచి తాము పడిన కష్టాన్ని మరిచిపోయేలా చేసిందని మహిళా నాయకురాళ్లు తెలిపారు..

Share This:

2,442 views

About Syamkumar Lebaka

Check Also

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

కాకినాడలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ రౌడీలు చేసిన దాడి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 1 =