Home / జన సేన / పార్టీలకి అతీతం మా సేవ అంటున్న జనసైనికులు.. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆపన్నహస్తం..

పార్టీలకి అతీతం మా సేవ అంటున్న జనసైనికులు.. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆపన్నహస్తం..

కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో తాము ఎప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించుకున్నారు జనసేన కార్యకర్తలు. అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో నిత్యం ముందడుగు వేస్తూనే ఉన్నారు. పనులులేక తాము ఇబ్బందులు పడుతూ కూడా సాటివారి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తూ తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఘటనలో మచిలీపట్నం నియోజకవర్గం పోతేపల్లి గ్రామానికి చెందిన వెంకయ్య నాయుడు అనే వ్యక్తి గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. తమ వద్ద ఉన్న డబ్బు కొంత మేర చికిత్స చేయించారు. ప్రస్తుతం బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితుల్లో రూ. 10 లక్షల రూపాయిల అవసరం అని వైద్యులు చెప్పారు. రూ. 5 లక్షలు అతని కుటుంబ సభ్యులు సమకూర్చగా., మిగిలిన మొత్తం దాతల కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న పోతేపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు తమకు మూడు నెలలుగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నా., సాటి మనిషిని ఆదుకోవాలన్న సంకల్పంతో తమవంతు తలో చెయ్యి వేసి రూ. 60 వేలు పోగు చేశారు. దానికి మచిలీపట్నంకి చెందిన జనసైనికులు మరో రూ. 40 వేలు మేమున్నామంటూ జత చేశారు. మొత్తం లక్ష రూపాయిలు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్ధి బండి రామకృష్ట చేతుల మీదుగా వెంకయ్య నాయుడికి అందచేశారు. అతన్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఆర్కె., మరింత సహాయం కోసం దాతలను అన్వేషిస్తామని మాటిచ్చారు.

దాతలు ఎవరైనా బి. వెంకయ్య నాయుడి ఆపన్నహస్తం అందించాలని కోరుతూ అతని అకౌంట్ కి సంబంధించిన వివరాలు పవన్ టుడేకి పంపారు..

అకౌంట్ నంబర్: 7570000100011956(పంజాబ్ నేషనల్ బ్యాంక్) మచిలీపట్నం బ్రాంచ్. Ifsc code: PUNB0757000 ఈ అకౌంట్ నంబర్ కి నేరుగా సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.  28  ఏళ్ల వయసులో మాయదారి రోగంతో ఇబ్బంది పడుతున్న అతన్ని  ఆదుకోండి.

ఈ కార్యక్రమం  పోతేపల్లి మరియు ఉల్లిపాళ్లెం జనసేన నాయకులు, కార్యకర్తలు బండి రామకృష్ణ, గెడ్డం రాజు, v.చౌదరి, వీర మహిళ సంధ్య రాణిల చేతుల మీదుగా జరిగింది.

Share This:

854 views

About Syamkumar Lebaka

Check Also

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

కాకినాడలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ రౌడీలు చేసిన దాడి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + sixteen =