Home / జన సేన / ఆరు పార్లమెంట్, 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ ల ప్రకటన..

ఆరు పార్లమెంట్, 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ ల ప్రకటన..

ఐదుగురితో ఉత్తరాంధ్ర జిల్లాలకు సమన్వయ కమిటీ

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం వేగం పెంచింది. ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జ్ లు నియమించిన చోట మండల, పట్టణ కమిటీల నిర్మాణం చాలా వరకు పూర్తి కాగా, అధికారికంగా వాటిని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇన్ ఛార్జ్ లు లేని నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ ల నియామకం, ప్రాంతాల వారీగా పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణకు సమన్వయ కమిటీల నియామక ప్రక్రియపై కూడా అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు.. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమన్వయ కమిటీలో టి.శివశంకర్,  మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను కూడా నియమించారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

* విశాఖపట్నం జిల్లాకు సంబంధించి…

విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ గా సిబిఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణను నియమించగా, విశాఖపట్నం నార్త్ అసెంబ్లీకి – పి.ఉషాకిరణ్, గాజువాకకు – కోన తాతారావు, భీమిలి – పంచకర్ల సందీప్, అనకాపల్లి అసెంబ్లీ – పరుచూరి భాస్కర రావు, ఎలమంచిలి – సుందరపు విజయకుమార్, చోడవరం – పి.వి.ఎస్.ఎన్.రాజు

అరకు పార్లమెంట్ ఇంచార్జి : పి.గంగులయ్యలను నియమించారు.

* తూర్పుగోదావరి జిల్లా నుంచి…

కాకినాడ పార్లమెంట్ ఇంచార్జిగా – పంతం నానాజీ, పిఠాపురం – మాకినీడు శేషుకుమారి, పెద్దాపురం – తుమ్మల రామస్వామి, కాకినాడ సిటీ – ముత్తా శశిధర్, జగ్గంపేట – పాటంశెట్టి సూర్యచంద్ర, పత్తిపాడు – వరుపుల తమ్మయ్య బాబు, అమలాపురం పార్లమెంట్ ఇంచార్జిగా – డి.ఎం.ఆర్. శేఖర్, అమలాపురం అసెంబ్లీ – శెట్టిబత్తుల రాజబాబు,

ముమ్మిడివరం – పితాని బాలకృష్ణ, రామచంద్రపురం – పోలిశెట్టి చంద్రశేఖర్, రాజోలు – రాపాక వరప్రసాద్,

పి.గన్నవరం – పాముల రాజేశ్వరి, కొత్తపేట – బండారు శ్రీనివాస్, మండపేట – వేగుళ్ల లీలాకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జిగా – కందుల దుర్గేష్, అనపర్తి – మర్రెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ – అత్తి సత్యనారాయణ,

రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ గా – కందుల దుర్గేష్ లకు బాధ్యతలు అప్పగించారు.

* గుంటూరు జిల్లాకి సంబంధించి….

గుంటూరు పార్లమెంట్ ఇంచార్జిగా-  బోనబోయిన శ్రీనివాస యాదవ్, గుంటూరు వెస్ట్  – తోట చంద్రశేఖర్, గుంటూరు ఈస్ట్ – షేక్ జియా ఉర్  రెహమాన్, రేపల్లె – కమతం సాంబశివ రావు, మంగళగిరి – చిల్లపల్లి శ్రీనివాస్, తెనాలి – నాదెండ్ల మనోహర్, సత్తెనపల్లి – వై.వెంకటేశ్వర రెడ్డి, నరసరావు పేట: సయ్యద్ జిలానీలను నియమించారు.

* చిత్తూరు జిల్లాలోని….

పీలేరు అసెంబ్లీ స్థానానికి –  బి. దినేష్, మదనపల్లి – గంగారపు స్వాతి, శ్రీకాళహస్తి – వినుత నగరం, తిరుపతి – కె. కిరణ్ రాయల్, కుప్పం – డా. ఎం. వెంకటరమణ, గంగాధర నెల్లూరు – డా. పొన్న యుగంధర్ లకు బాధ్యతలు అప్పగించారు.. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇన్ ఛార్జ్ ల నియామకానికి సంబంధించి కసరత్తు కొనసాగుతోంది.

Share This:

672 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + 5 =