Home / జన సేన / రైతు సమస్యలపై 12న జనసేనాని నిరాహారదీక్ష.. పరిష్కారానికి సర్కారుకు మూడు రోజుల డెడ్ లైన్..

రైతు సమస్యలపై 12న జనసేనాని నిరాహారదీక్ష.. పరిష్కారానికి సర్కారుకు మూడు రోజుల డెడ్ లైన్..

  • ప్రభుత్వం స్పందించకుంటే కాకినాడలో నిరాహార దీక్ష
  • జనవరి వరకు స్పందించకుంటే ఉదృతంగా రైతు ఉద్యమం
  • రైతు కన్నీరు రాష్ట్రానికి శాపం
  • చేతిలో అధికారం లేకున్నా నిరాహారదీక్షతో అండగా నిలుస్తా
  • జగన్ రెడ్డి గారి ఇంటి రిపేరుకు కోట్ల బిల్లులు పెడతారు..
  • రైతుల ధాన్యానికి మాత్రం రసీదులు ఇవ్వరా?
  • ధాన్యం తీసుకుని 45 రోజులు అయితే ఎక్కడున్నాయో తెలియదు
  • మా రైతుల ధాన్యం ఎక్కడ అని రాపాక గారు సభలో నిలదీయండి
  • ముద్దులు పెట్టి , బుగ్గలు నిమిరితే రైతుల కడుపు నిండదు

మండపేటలో రైతులతో జనసేనాని..

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో మూడు రోజుల్లో రైతు సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే ఈ నెల 12న కాకినాడ వేదికగా ఒక రోజు నిరాహార దీక్షకు దిగుతానని జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రభుత్వానికి మూడు రోజుల సమయం ఇస్తున్నట్టు తెలిపిన ఆయన.,  రైతులకు లాభసాటి ధర ఇస్తారా? లేదా? కనీసం గిట్టుబాటు ధర అయినా ఇస్తారా లేదో వేచి చూద్దామన్నారు.. ప్రభుత్వం నుంచి స్పందన రాని పక్షంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపడతానన్నారు. ఆదివారం మధ్యాహ్నం మండపేటలో రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వ విధానాలతో తాము పడుతున్న కష్టాలను వివరించారు. అనంతరం జనసేన అధినేత రైతులను ఉద్దేశించి మాట్లాడారు.. పవన్ కళ్యాణ్ పూర్తి ప్రసంగ పాటం..

ఆనాడు శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్న బాధితుల కోసం నిరాహార దీక్ష చేపట్టాను.

ఇప్పడు రైతుల కష్టాలు చూసి ఈ నిర్ణయం తీసుకున్నా.

 వైసిపి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా మీరు కష్టపడిన రైతులకు, రక్త మాంసాలు ధారపోసి పంట పండించిన రైతులకు కులాలతో సంబంధం లేకుండా ఏదో ఒక బలమైన నిర్ణయం తీసుకోకుంటే., 12వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన నిరాహారదీక్ష చేపడతా.

 జనవరి వరకు రైతు సమస్యలకు పరిష్కారం లభించకుంటే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తాం.

 రైతు కన్నీరు పెడితే రాజ్యం సుభిక్షంగా ఉండదు. రైతు కన్నీరు రాష్ట్రానికి శాపం. రైతుల శాపం తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. రైతు శపిస్తే పట్టెడన్నం దొరకదు గుర్తుంచుకోండి.

నా దగ్గర అధికారం లేదు. కానీ నేను ఒక మాట చెబితే అది పది మందికి తెలుస్తుంది.

 అందుకే నేను నిరాహారదీక్ష ద్వారా మీకు అండగా ఉంటాను.

 నేను మీ తరఫున పోరాటం చేస్తాను. వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మూడు రోజుల్లో స్పందించి తీరాలి.

లేదంటే నేను పోరాటానికి దిగాల్సి వస్తుంది.

 ఆ తర్వాత పరిస్తితులు ఎటు దారితీస్తాయో తెలియదు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ రెడ్డి గారు స్పందించాలని కోరుతున్నాం.

ఎన్నికలకు ముందు అందర్నీ కూర్చోబెట్టి జగనన్న వస్తే చాలా అద్భుతమైన ప్రభుత్వం వస్తుంది అని చెప్పారు.

 మొన్న తిరుపతి రైతు బజారుకు వెళ్తే కిలో ఉల్లిపాయలు రూ. 140-రూ. 180 పడుతోంది అని ప్రజలు చెప్పారు.

 సామాన్య ప్రజల కోసం కిలో ఉల్లిపాయలు రూ. 25కి ఇవ్వండి.

అవసరం అయితే జగనన్న ఉల్లిపాయల పథకం అని పేరు పెట్టుకోండి. ఓట్లు సంపాదించుకోండి.

మరో ఐదేళ్లు కాదు మరో 30 ఏళ్లు పాలించుకోండి.

 మేము ప్రజల కోసం ఇలా రోడ్ల వెంట తిరుగుతూ ఉంటాం.

 మీరు ప్రజలకు ఏదో ఒక మేలు చేస్తే చాలు మాకు అదే పది వేలు.

 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు మాటలు వక్రీకరించడానికి, పిచ్చి మాటలు మాట్లాడడానికా.

 పనికిమాలిన మాటలు మాని పనికొచ్చేది మాట్లాడండి.

 వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు అండగా నిలబడే ప్రకటన మీ ప్రభుత్వం చేయకపోతే, డబ్బులు విడుదల చేయకపోతే జనసేన పార్టీ చాలా బలంగా, భారీ ఎత్తున కార్యక్రమం చేపడుతుంది.

మా ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్ గారికి చెబుతున్నా

 రేపు అసెంబ్లీకి వెళ్లిప్పుడు మా రైతుల ధాన్యం ఎక్కడ ఉంది అని ప్రభుత్వాన్ని నిలదీయండి.

 పొలాల నుంచి పంట తీసేశారు. రైతులు ఎలాంటి రసీదులు లేకుండా కేవలం మాట మీద కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇచ్చేశారు.

 ఆ ధాన్యం ఎక్కడ ఉంది మిల్లర్ల దగ్గర ఉందా? లేకపోతే ఇంకా ఎక్కడ అయినా ఉందా? మీ చర్యలు అప్రజాస్వామికం.

జగన్ రెడ్డి గారు అన్ని తన ఇంటి మరమత్తుల కోసం   అన్ని కోట్ల బిల్లులు పెట్టుకున్నారు.

రక్త మాంసాలు ధారపోసే రైతు పంటకు మాత్రం రసీదు ఇవ్వరు.

 మీకు వేల కోట్లు ఉండి సొంతంగా ఇంటి పనులు చేయించుకోలేరా? మీకు ప్రభుత్వం సొమ్ము కావాలా?

ఆ సొమ్ము మొత్తం దర్జాగా మేం కట్టిన శిస్తుల నుంచి తీసుకున్నదేగా. దానికి రసీదులు పెట్టి తీసుకున్నప్పుడు రైతులు పండించిన పంటకు రసీదు ఇవ్వకపోతే ఎలా? ఆ పంట ఎక్కడికి వెళ్తుంది. మీరు కోరుకున్నట్టు 36 ఏళ్లు సుభిక్షంగా పాలించాలి అంటే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి. పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరినంత మాత్రాన రైతుల కడుపు నిండదు. రైతు సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడకుంటే భవిష్యత్ పరిణామాలకు మీరే బాధ్యలు.

మీకు ఓట్లకు డబ్బులు పంచడానికి ఓట్లు కొనుక్కోవడానికి డబ్బు పంచుతారు గానీ, అన్నం పెట్టే రైతు కన్నీరు తుడిచి వారికి ఒక రూపాయి  లాభం ఇవ్వలేని దుస్థితి. ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయలు ప్రజల కన్నీరు తుడిచే పరిస్థితి లేదు. విభిన్న కులాల్లో, మతాలయినా మన అందరి రక్తం ఒకటే. ప్రభుత్వ పథకాలు వెనుకబడిన వర్గాలు కాదంటూ రైతులకు భరోసా ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించే అంశం. భారత రాజ్యాంగం అందర్నీ సమంగా చూడమంటోంది. పొలం ఎక్కువ ఉంటే ఆ కష్టం నీకు వర్తించదు అంటే అది నాకు కష్టం అనిపింది.

నేను రాజకీయ నాయకుడి కంటే ముందు ఓ రైతు బిడ్డనే. పిల్లల చదువులకు, ఆడబిడ్డల చదువులకు ఉన్న రెండు ఎకరాలు ముక్కలు ముక్కలుగా అమ్ముకోవడం నాకు తెలుసు. స్వయంగా వరి నాటి వ్యవసాయం చేసిన వాడిని నాకు ఆ కష్టం తెలుసు. ప్రస్తుత రైతుల కష్టాలు వింటే నాకు కవి శేషేంద్ర గారి పలుకులు గుర్తుకువచ్చాయి. మనిషి అంటే నడిచే చెట్టు అయితే చెట్టుకు ఏడాదికి ఒక వసంతం అయినా దక్కుతుంది. మనిషిని అయినందుకు ఆ ఒక్క వసంతం కూడా తెలియదు. ఏడాది పొడుగునా కష్టాలే తెలుసు అన్న మాటలు నాకు గుర్తుకు వస్తున్నాయి.

రైతులు ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి. ఈ ఏడాది అప్పులు తీరలేదు. అయినా చేస్తూనే ఉన్నాడు. రైతు వ్యవసాయాన్ని ఓ పరపతి కోసం చేస్తున్నారు. వారు చేసే పనికి గౌరవం మాత్రమే కోరుకుంటున్నాడు. 100 మంది రైతుల్లో 70 శాతం కౌలు రైతులే ఉన్నారు. భూమి ఒకరి చేతిలో ఉంటే సాగు ఒకరు చేస్తున్నారు. కౌలు రైతు పెట్టిన పెట్టుబడికి వ్యవసాయం లాభసాటిగా ఉండాలని కోరుకునే వాడిని. లాభం రాకపోగా ఏటా రూ. 15 వేల అప్పు మిగులుతోంది. అప్పులతో అలసిపోతూ రైతు అంతులేని పద్మవ్యూహంలో రైతు ఇరుక్కుపోతున్నాడు.

రైతుల ధగ్గర నుంచి ధాన్యం తీసుకువెళ్లి 45 రోజులు అయ్యింది. ఆ పంట ఎక్కడుందో తెలియదు. తన దగ్గర డబ్బు లేకపోయినా మిల్లర్ల దగ్గర, షావుకార్ల దగ్గర అప్పులు చేసి ఏడాది పొడుగునా కష్టపడి పండిస్తే చివరికి ధర మిల్లర్లు నిర్ణయిస్తారు. రైతు రక్తమాంసాలు ధారపోస్తే మనం ఒక ముద్ద తింటున్నాం. ఆ పెట్టుబడికి అప్పు మిగులుతోంది కానీ లాభం రావడం లేదు. రైతుల అభివృద్ధి కోసం 93 అంశాలు అమలు చేయాలన్న డిమాండ్ ఉంది.

కమిషన్ లేకుండా ధాన్యం అమ్మడం కుదరదు అని రైతులు చెబుతున్నారు. ఆరబెట్టుకోవడానికి కళ్లాలు లేవు. గతంలో పోరంబోకులు, రోడ్ల మీద ఆరబెట్టుకునే వారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు దాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు గిడ్డంగులు లేవు. రాష్ట్ర విభజనకు ముందు మోహన్ కందా గారు ప్రభుత్వం కళ్లాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గిట్టుబాటు కాదు లాభసాటి ఇవ్వాలని చెప్పారు. ఈ రోజుకు ప్రభుత్వాలు రైతులకు అండగా ఉండలేకపోయాయని అన్నారు.

Share This:

501 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × one =