Home / జన సేన / వెల్లువెత్తిన జనసేనాని స్ఫూర్తి.. రాష్ట్ర వ్యాపితంగా జనసేన ఆహార శిభిరాలు..

వెల్లువెత్తిన జనసేనాని స్ఫూర్తి.. రాష్ట్ర వ్యాపితంగా జనసేన ఆహార శిభిరాలు..

ఆమెది ఎముకలేని చేయి.. తినే వారు తినిపోతుంటే.. వండి వార్చే ఆవిడ అర్ధరాత్రి అపరాత్రి అన్న బేధం లేకుండా వచ్చిన అతిధులకు వడ్డీస్తూనే ఉండేవారు.. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరి కడుపులో ఆకలి మాత్రమే ఆవిడకు కనిపించేది.. దేశాన్ని ఏలిన ఆంగ్లేయులు సైతం శిరస్సు వంచిన ఘనత దక్కించుకున్న డొక్కా సీతమ్మ గారి పేరు నేటి తరంలో ఎంత మందికి తెలుసు అంటే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కారణం మనం కట్టిన పన్నుల నుంచి మనకు సేవ చేయడానికి ఏర్పడిన ప్రభుత్వాలు ఇలాంటి మాణిక్యాలను మరచి అన్న క్యాంటీన్లు, అయ్య క్యాంటీన్లు అంటూ తమ పార్టీ నేతలు పేర్లతో పథకాలు పెట్టుకుంటున్నాయి. మరి కొన్ని లక్షల మంది ఆకలి తీర్చిన అన్న పూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ గారు నేటి తరానికి ఎలా తెలుస్తారు.? అదే సమయంలో ఆమె స్ఫూర్తిని అందిపుచ్చుకోవడానికి, ఆమె ఖ్యాతిని దిగదిగంతాలకు చాటడానికి నేనున్నానంటూ  ముందుకు వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ విజయం సాధిస్తే ఆ మహనీయురాలి పేరిట కళాశాలల్లో విద్యార్ధులకు ఉచిత క్యాంటీన్లు పెట్టాలని భావించారు. ఇప్పుడు ఆమె కీర్తి మరోసారి దిగదిగంతాలకు చాటేలా భవన నిర్మాణ కార్మికుల కోసం రెండు రోజుల ఆహార శిభిరాలు ఏర్పాటు చేశారు. డొక్కా సీతమ్మ గారు ఎవరో తెలుసుకోవాలన్న కాంక్ష యావత్ ఆంధ్ర జాతిలో నింపారు.

రాజకీయాలు ఎందుకు చేయాలి.. నేటి తరం రాజకీయ నాయకుల్లా తమ జేబులు నింపుకోవడానికా? సామాన్యుడి సమస్యలు తీర్చేందుకా అంటే రెండో అంశానికే ఓటు వేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్., మొదటి నుంచి తాను ఆచరించి తన సేనలో స్ఫూర్తి నింపుతూ వస్తున్నారు. శుక్రవారం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు సైతం ఆయన ప్రారంభించి స్వయంగా భవన నిర్మాణ కార్మికులకు వడ్డించారు. మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని జనసేనాని ప్రారంభించినంతనే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, జనసైనికులు లక్షలాది మంది కడుపు నింపే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అన్ని నియోజకవర్గాల్లో సుమారు 500లకు పైగా శిబిరాలు ఏర్పాటు చేసినట్టుగా జనసేన వర్గాల సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో తూతూ మంత్రంగా కాకుండా మండలానికి ఒక శిబిరం ఏర్పాటు చేయడం విశేషం.

నేడు 1000 మందికి, రేపు 1500 మందికి..

ముఖ్యమంత్రి గారి జిల్లా కడప కేంద్రంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సుంకర శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఆహార శిభిరం భవన నిర్మాణ కార్మికులతో కిటకిటలాడింది. మొత్తం నాలుగు అడ్డాల్లో కార్మికులు కూలీ కోసం వేచి ఉంటారు. నాలుగు ప్రాంతాల వారినీ స్థానిక జెడ్పీ కూడలికి చేర్చిన సుంకర., మొదటి రోజు వెయ్యి మంది కార్మికుల ఆకలి తీర్చారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి ఆయనా భోజనం చేశారు. రెండో రోజు రెట్టించిన ఉత్సాహంతో 1500 మందికి వండి వార్చనున్నట్టు తెలిపారు.

కృష్ణా జిల్లాలో ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ఇన్ ఛార్జ్ లు ఉన్న చోటా, లేని చోటా కూడా కార్యకర్తలు, నాయకులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు భారీ ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇన్ ఛార్జ్ లు లేని నియోజకవర్గాల్లో పామర్రు, కైకలూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేశారు. పామర్రు నియోజకవర్గంలో సుమారు 300 మంది భవన నిర్మాణ కార్మికులకు తాడిశెట్టి నరేష్ ఆహార పంపిణీ చేపట్టగా, జనసేన కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో నల్లగోపుల చలపతి భారీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడా రెండు రోజుల్లో వెయ్యి మందికి ఆహార పంపిణీ చేయనున్నారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్, ప్యాక్ సభ్యులు డాక్టర్ హరిప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ మనుక్రాంత్ రెడ్డిలు కూడా డొక్కా సీతమ్మ శిబిరాలు ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులకు ఆహార ఏర్పాట్లు చేశారు.

విజయనగరం జిల్లాలో ఒకటి రెండు చోట్ల మినహా అన్ని నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలే ముందుకు వచ్చి పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.

విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అయితే డొక్కా సీతమ్మ శిబిరాలు ఊరూరా పెట్టారా ఏంటి అన్న సందేహం కలిగే స్థాయిలో ఏర్పాటు చేశారు. పెందుర్తిలో ఇన్ ఛార్జ్ లేకపోయినా సుమారు 2 వేల మంది కార్మికులకు కడుపు నిండా అన్నం పెట్టారు జనసేన కార్యకర్తలు.

గుంటూరు జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ అన్నదానం క్రతువు దిగ్విజయంగా ముగిసింది.

అనంతలో టీసీ ఆరుణ్, మధుసూదన్ రెడ్డి తదితరుల ఆద్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అన్నం నెట్టారు.

రాయలసీమ అన్ని జిల్లాలతో పాటు అనావృష్టి పరిస్థితుల్లో అన్నం పెడితే, మా బతుకులకు జీవం పోశారు అంటూ జనసేనానికి దీవెనలు అందించారు. అన్ని జిల్లాల్లో జరిగిన ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ శిభిరానికి సంబంధించిన ఫోటో గ్యాలరీ మీ కోసం..

Share This:

592 views

About Syamkumar Lebaka

Check Also

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

కాకినాడలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ రౌడీలు చేసిన దాడి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × one =