Home / జన సేన / 30 న జనసేన విస్తృత స్థాయి సమావేశం.. రాజధాని అంశంపై కీలక చర్చ..

30 న జనసేన విస్తృత స్థాయి సమావేశం.. రాజధాని అంశంపై కీలక చర్చ..

రాజధాని వ్యవహారం., ఆంధ్రప్రదేశ్ లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ నెల 30వ తేదీన జనసేన పార్టీ విస్తృత సమావేశం నిర్వహించనుంది.. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.. సోమవారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం అవుతుందని తెలిపింది.. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు-రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు-ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత,  జనసేన స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు పార్టీ వెల్లడించింది..

జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు  ఈ సమావేశంలో పాల్గొంటారు.

Share This:

551 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − seven =