Home / జన సేన / మాతృ భాషను మన నదులను కాపాడుకుందాం రండి.. జనసేనాని పిలుపు

మాతృ భాషను మన నదులను కాపాడుకుందాం రండి.. జనసేనాని పిలుపు

ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తనదైన శైలిలో పోరాటం చేస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు భాషా పరిరక్షణ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. భాషతో పాటు ప్రకృతి సంపదలో అతి ప్రధానమైన నదులను కాపాడుకునేందుకు కూడా పిలుపు నిచ్చారు.. మాతృ భాషను, నదులను పరిరక్షణ కోసం ‘మన నుడి… మన నది’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి సంబంధించి విధివిధానలు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.   ‘మన భవితకు ప్రాణాధారమైన మాతృ భాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామ ఈ సందర్భంగా జనసేనాని అభిప్రాయపడ్డారు. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరమన్నారు. మాతృ భాషను, నదులను పరిరక్షించుకొనే దిశగా ‘మన నుడి… మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు.

“నాగరికతకు పుట్టినిల్లు నది. నది లేనిదే సంస్కృతి లేదనీ, నది నశించాక ఆ సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో కావలసినన్ని రుజువులున్నాయన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదన్నారు. మాతృ భాష గతించాక సంస్కృతిక విశనం తప్పదని హెచ్చిరించారు. అందుకు చరిత్రలో బోలెడు రుజువులు కనిపిస్తాయి. మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నాం. మన భవితకు ప్రాణాధారమైన అమ్మనుడికీ మనం అతివేగంగా దూరమవుతున్నాం. మాతృ భాష మూలాలను మనమే నరికేసుకుంటున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మన నుడినీ, మన నదిని కాపాడుకోవాలి. అందుకే విజ్ఞులు, మేధావులతో ఈ అంశంపై చర్చించాం. మాతృ భాషను పరిరక్షించుకోవాలి. మన నదులను కాపాడుకోవాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారినీ భాగస్వాముల్ని చేసేలా “మన నుడి… మన నది” కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు.

ఆంగ్ల మాధ్యమ బోధనకు సంబంధించిన జీవో ప్రభుత్వం విడుదల చేసిన నేపధ్యంలో పవన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో శ్రీశైలం డ్యామ్ పరిశీలనకు వచ్చిన వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ నుంచి కూడా నదీ పరిరక్షణకు పలు సూచనలు స్వీకరించారు.

Share This:

198 views

About Syamkumar Lebaka

Check Also

సైనిక కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన జనసేనాని..

సైనిక కుటుంబాల సంక్షేమార్ధం తనవంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముందుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + 15 =