Home / జన సేన / రాజు రవితేజ రాజీనామాకు జనసేనాని ఆమోదం.. విపరీత వ్యాఖ్యలపై జనసేన నేతల ఫైర్..

రాజు రవితేజ రాజీనామాకు జనసేనాని ఆమోదం.. విపరీత వ్యాఖ్యలపై జనసేన నేతల ఫైర్..

జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ రాజీనామాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదించారు..ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.. రవితేజ పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నట్టు చెప్పిన జనసేనాని., గతంలో కూడా అయన ఇలాంటి బాధతోనే పార్టీని వీడి మళ్లీ తిరిగి పార్టీలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.. ఆయనకు మంచి భవిష్యత్తు, ఆయన కుటుంబానికి శుభం కలుగ చేయాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నట్టు చెప్పారు..
రవితేజ నమ్మక ద్రోహి-శంకర్ గౌడ్
పోలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ రాజీనామాను ఎంతో గౌరవంగా జనసేన అధినేత ఆమోదించగా., అతను శృతి మించిన పదజాలంతో పార్టీ మీద బురదచల్లుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఏమి ఆశించి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చారో చెప్పాలని పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ శంకర్ గౌడ్ ప్రశ్నించారు. ఆరు నెలల క్రితం ఆరోగ్యం బాగాలేదు… ఆసుపత్రిలో ఉన్నాను అని చిన్న మెసేజ్ చేస్తే జనసేనాని ఆందోళన చెంది ఆఘమేఘాల మీద లక్షా 50 వేల రూపాయలు పంపిన విషయం గుర్తుందా అని అన్నారు. ఆ విషయం రవితేజకు గుర్తున్నా లేకపోయినా యశోదా ఆసుపత్రిలో నా చేతుల మీదుగానే అతనికి ఇచ్చిన విషయం తనకు గుర్తు ఉందని శంకర్ గౌడ్ వెల్లడించారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమంటే ఇదేనేమో! ఆసుపత్రిలో చేసిన సాయం మాత్రమే కాదు. పవన్ కళ్యాణ్ గారు రవితేజను ఆర్ధికంగా ఆదుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. కను సైగతో కోట్లాది మందిని కదిలించ గల సత్తా ఉన్న మా అధినేత., మీకు తనతో సమానమైన స్థానం ఇస్తే., అవన్నీ మరచి ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక ఏ శక్తులు ఉన్నాయో కూడా వివరిస్తే సమంజసంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. రవితేజ లాంటి నమ్మక ద్రోహులను పెంచి పోషించడానికి మించి సమాజానికి ప్రమాదం ఇంకోటి ఉండదని శంకర్ గౌడ్ మండిపడ్డారు.

Share This:

1,620 views

About Syamkumar Lebaka

Check Also

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

కాకినాడలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ రౌడీలు చేసిన దాడి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − six =