Home / జన సేన / 25 న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ”కీ”భేటీ

25 న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ”కీ”భేటీ

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.)  కీలక భేటీ ఈ నెల 25 న జరగనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన హైదరాబాద్ లో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకురానున్నట్టు పి.ఎ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు తెలుగు భాష పరిరక్షణ కోసం పార్టీ త్వరలో చేపట్టబోయే “మన నుడి – మన నది”, డొక్కా సీతమ్మ పేరిట నిర్వహించిన ఆహార శిబిరాలకు సంబంధించిన వివరాలు, ఇసుక లభ్యత-భవన నిర్మాణ కార్మికుల స్థితిగతులు, రాయలసీమలోని పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులూ,క్యాడర్ సమావేశాలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి నాయకులు, క్యాడర్ సమావేశాలు పూర్తి కాగా పలు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ ల నియామక ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలిన నియోజకవర్గాలతో పాటు రాయలసీమ సమావేశాలు, ఇన్ ఛార్జ్ ల నియామక ప్రక్రియ సమావేశంలో కీలకాంశం కానున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇన్ ఛార్జ్ ల నియామక ప్రక్రియ పూర్తి చేస్తే, గ్రామ, మండల స్థాయి కమిటీలు కూడా సిద్దం చేయొచ్చన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం.

Share This:

388 views

About Syamkumar Lebaka

Check Also

సైనిక కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన జనసేనాని..

సైనిక కుటుంబాల సంక్షేమార్ధం తనవంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముందుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × five =