Home / జన సేన / జనసేన కార్యాలయంలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

జనసేన కార్యాలయంలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి మహిళా కార్యకర్తలంతా ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మహిళా సాధికార కమిటీ చైర్మన్ రేఖా జవ్వాదితో పాటు వీర మహిళలు పాల్గొన్నారు. లక్ష్మీబాయి వీరత్వాన్ని, ఆమె స్ఫూర్తితో ప్రతి మహిళా పోరాడాల్సిన ఆవశ్యకతను వీర మహిళలు చాటి చెప్పారు. జనసేన పార్టీలోని ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయిలా నేటి సామాజిక పరిస్థితులపై యుద్ధం చేయాలన్న కాంక్షతో పవన్ కళ్యాణ్ పార్టీ మహిళా విభాగానికి ఆమె పేరు పెట్టిన విషయం తెలిసిందే.

Share This:

291 views

About Syamkumar Lebaka

Check Also

సైనిక కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన జనసేనాని..

సైనిక కుటుంబాల సంక్షేమార్ధం తనవంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముందుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × one =