Home / పవన్ టుడే / అసెంబ్లీ సమావేశాలు అవసరమైన అంశాల ప్రస్థావన లేకుండానే ముగిశాయి-పవన్ కళ్యాణ్

అసెంబ్లీ సమావేశాలు అవసరమైన అంశాల ప్రస్థావన లేకుండానే ముగిశాయి-పవన్ కళ్యాణ్

ఏడు రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో 48 గంటల పాటు జరిగిన చర్చలో మొత్తం 97 మంది సభ్యులు మాట్లాడడం వల్ల ప్రజలకు ఒనగూరిన లాభం ఏంటి అంటే? అధికార, ప్రతిపక్షాల నేతల బూతుల పంచాంగాలు, ఇప్పటి వరకు అసెంబ్లీ రికార్డుల్లో కనబడని బూతుపురాణాలు.. ఇదే అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మేలు.. ఇదే అంశం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన బ్రహ్మాస్త్రం ట్విట్టర్ వేదికగా విమర్శల వాన కురిపించారు.. ముఖ్యంగా చివరి రోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనపై తన సందేహాలను వెలిబుచ్చారు. రాజధాని అంశంలో అయోమయాన్ని వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా పొడిగించారన్నారు. జగన్ రెడ్డి గారు చేసిన ప్రకటన మరింత గందరగోళానికి కారనమయ్యిందన్నారు. ఓ వైపు బొత్స ఇష్టారాజ్యంగగగా ప్రకటనలు చేస్తూ ప్రజల్లో   అనిశ్చితి నెలకొల్పగా., ముఖ్యమంత్రి గారి తాజా ప్రకటన ప్రభుత్వం దగ్గగగర అవగాహన, స్పష్టత రెండూ కొరవడిన అంశాన్ని బట్టయలు చేస్తున్నాయన్నారు.

రైతుల సమస్యలు 175 మంది సభ్యుల్లో ఏ ఒక్కరికీ పట్టలేదంటూ విచారం వ్యక్తం చేశారు. చిరు ధాన్యాలు, కాయధాన్యాల బోర్డులు ఏర్పాటుకు ఆమోదం తెలపడం మినహా సభలో రైతుల ప్రస్తావన లేకపోవడం పట్ల జనసేన అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మిన రైతుకు ఇప్పటి వరకు చేతికి డబ్బు రాలేదనీ, మెట్ట రైతుల విషయానికి వస్తే వేరుశనగ, పసుపు, టమాటా, కర్రపెండలం తదితర రైతుల గిట్టుబాటు ధర తదితర అంశాలకు సమయం ఎందుకు దొరకలేదంటూ నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎక్కడ ఉంది? దానికి ప్రభుత్వం ఎప్పుడు డబ్బు చెల్లిస్తుంది చెప్పాలన్నారు.

ఇక ఇసుక కోరత కారణంగా మరణించిన భవన నిర్మాణ కార్మికుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల మౌనం పాటిద్దామన్న ఆలోచన గానీ., ఉల్లి తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి చేరుకున్న నేపధ్యంలో సామాన్యుడి పరిస్థితి గానీ  ఏ సభ్యుడి నోటా వినబడలేదన్నారు.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Share This:

454 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 2 =