Recent Posts

వైసీపీ విజ‌యోత్సాహాలు ”మేక‌పోతు గాంభీర్యాలే”.. ఏపీలో అనూహ్య ఫ‌లితాలు ఖాయం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌ ముగిసిన నేప‌ధ్యంలో ఈవీఎంల‌లో నిక్షిప్త‌మై ఉన్న ‘విజ‌యల‌క్ష్మి’ ఎవ‌ర్ని వ‌రిస్తుంది.? ఇప్పుడు స‌ర్వ‌త్ర విన‌బ‌డుతున్న ప్ర‌శ్న ఇది.. ఎన్నిక‌లు ముగిసిన ప్ర‌తిసారీ ఎగ్జిట్ పోల్స్ ఓ పార్టీలో ఉత్సాహం.. మ‌రో పార్టీలో నిరుత్సాహం నింపుతూ ఉండేవి.. ఈ ఎగ్జిట్ పోల్స్‌, ప‌బ్లిక్ ప‌ల్స్‌ని క‌నిపెట్ట‌లేని సంద‌ర్బాలు కూడా కోకొల్ల‌లు.. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితులు మాత్రం సంప్ర‌దాయానికి పూర్తి విరుద్దంగా ఉన్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

బెజ‌వాడ‌లో ఓటేసిన జ‌న‌సేనాని.. పోలింగ్ ప్ర‌క్రియ‌లో లోపాలున్నాయ‌న్న ప‌వ‌న్‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విజ‌య‌వాడ‌లో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని పిన్న‌మ‌నేని పాలి క్లినిక్ రోడ్డులోని 91వ నంబ‌ర్ పోలింగ్ బూత్‌లో ఉద‌యం 9 గంట‌ల 40 నిమిషాల ప్రాంతంలో ఓటు వేశారు. ఓటు వేసేందుకు వ‌చ్చిన జ‌న‌సేనానిని చూసేందుకు అభిమానులు ఎగ‌బ‌డ్డారు.. ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ జ‌రుగుతున్న తీరుపై అనుమానాలు వ్య‌క్తం చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 శాతం …

Read More »

ఓట‌రు మ‌హాశ‌యా.. ఓటు వేసే ముందు ఒక్క క్ష‌ణం మ‌న‌స్సాక్షికి ప‌ని చెప్పండి..

ప్ర‌జా స్వామ్యంలో ఓటు వ‌జ్రాయుధం.. సామాన్యుడి చేతిలో అది ఓ పాసుప‌తాస్త్రం.. కానీ ఆ ఓటును ఎవ‌రి మీద ప్ర‌యోగిస్తున్నాం.. ఓటు వేసే ముందు ఒక్క క్ష‌ణం మీ మ‌న‌స్సాక్షిని ప్ర‌శ్నించుకుని ఓటు వేయండి.. రెండు వేలు ఇచ్చారు కదా డ‌బ్బు తీసుకుని ఓటు వేయ‌క‌పోతే బాగోదేమో అన్నా ఆలోచ‌న మీ మ‌న‌సుల్లో నుంచి తీసేయండి.. ఓటుకు నోటు తీసుకోవ‌ద్దు.. తప్ప‌క తీసుకోవాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చినా, రాజ‌కీయాల్లో అక్ర‌మార్జ‌న‌కు అభ్య‌ర్ధులు …

Read More »

85 శాతం యువ‌త‌, 60 శాతం మ‌హిళ‌లు జ‌న‌సేన‌తోనే.. ఏపీలో కొత్త స‌ర్వే ప్ర‌కంప‌న‌లు..

మ‌రో రెండు రోజుల్లో జ‌ర‌గ‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల మీద గంట‌కో స‌ర్వే తెర మీద‌కి వ‌స్తూ ఓట‌రు నాడిని ప్ర‌భావితం చేసేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. ఈ స‌ర్వేల్లో నిజం ఎంత అన్న విష‌యం ప‌క్క‌న‌పెడితే., ప‌క్కాగా రెండు పార్టీల క‌నుస‌న‌ల్లో ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతున్న‌ట్టు అర్ధం అవుతోంది.. వైసీపీకి అనుకూలంగా ఫ‌లానా స‌ర్వే ఉంది అంటూ రోజు మొత్తం ఆ పార్టీ పెయిడ్ వెబ్‌సైట్ల నుంచి …

Read More »

అవ‌నిగ‌డ్డ రాజ‌కీయాల్లో ‘జ‌న‌సేన’ కొత్త చ‌రిత్ర లిఖించ‌బోతోందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కు(ఉమ్మ‌డి రాష్ట్రం మొద‌లుకొని) కృష్ణా జిల్లా కేంద్రంగా ఉంటే., కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన చ‌రిత్ర మాత్రం అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానిదే.. భౌగోళికంగా ఓ మూల‌కు విసిరేసిన‌ట్టు క‌న‌బ‌డినా., రాజ‌కీయ చైత‌న్యం విష‌యంలో మాత్రం దివిసీమ బిడ్డ‌లు పెట్టింది పేరు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ముఖ్య‌మంత్రి స్థాయి వ‌ర‌కు వెళ్లిన నాయ‌కులు ఉన్నారు.. చుట్టు ప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గెలిచిన నాయ‌కులు ఉన్నారు.. మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స్థానానికి మొద‌టి ఎంపి కామ్రెడ్ …

Read More »

వెనుక‌బాటు ‘జ‌నాన్ని’ జాగృతం చేస్తున్న జ‌న‌సేన అభ్య‌ర్ధులు..

ఉత్త‌రాంధ్ర వెనుక‌బ‌డిన ప్రాంతం కాదు.. వెన‌క్కి నెట్ట‌బ‌డిన ప్రాంతం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిప్రాయం ఇది.. వెనుక‌బ‌డిన ప్రాంతం అయితే కొన్ని కుటుంబాలే ఎందుకు బాగుప‌డుతున్నాయి..? సామాన్యుడు సామాన్యుడిగానే ఎందుకు మిగిలిపోతున్నాడు..? ఒక్క ఏడాది క‌ష్టం వ‌స్తే ఉన్న‌ది అమ్ముకుని వ‌ల‌స‌లు ఎందుకు పోతున్నాడు.? ఉన్న ఊరిని వ‌దిలిపోయేలా చేస్తున్న ప‌రిస్థితులు ఏంటి..? నాయ‌కులు కోట‌లు నానాటికీ బ‌ల‌ప‌డుతుంటే., సామాన్యులు మాత్రం పొట్ట చేత‌ప‌ట్టుకుని సుధూర ప్రాంతాల‌కు పోతున్నారు.. …

Read More »

స‌ర్కారీ ఉద్యోగులు ”గాజుగ్లాసు”కు గుద్దేశారా..?

2004లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవ‌డంలో వారిదే కీల‌క‌పాత్ర‌.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అదే టీడీపీ గ‌ద్దెనెక్క‌డంలోనూ వారి పాత్ర‌ కాద‌న‌లేనిది.. నిత్యం ప్ర‌జ‌ల్లో మ‌మేకం అయి ఉండి.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర్చ‌డంతో పాటు పాల‌నా వ్య‌వ‌హారాల్లో ప్ర‌ధాన పాత్ర పోషించేది వారే.. వారే ప్ర‌భుత్వ ఉద్యోగులు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌రం లేదు.. గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌డంలోనే కాదు., ప్ర‌జ‌ల ఓటును ప్ర‌భావితం చేయ‌డంలోనూ వీరిది కీ …

Read More »

ఫైన‌ల్ కౌంట్ డౌన్ మొద‌ల‌య్యింది.. బ్యాలెట్ న‌మూనాల్ని జ‌నంలోకి తీసుకువెళ్లండి..

ఫైన‌ల్ కౌంట్ డౌన్ మొద‌ల‌య్యింది.. 2019 ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇంకా మూడు రోజులు మాత్ర‌మే స‌మ‌యం మిగిలి ఉంది.. ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల తాలూకు పోస్ట‌ల్ బ్యాలెట్ ఇప్ప‌టికే ముగిసింది కూడా.. ఇక మిగిలింది చివ‌రి యుద్ధ‌మే.. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధులు ఏ స్థానంలో ఉంటారు.. గాజు గ్లాసు గుర్తు వ‌రుస క్ర‌మంలో ఎక్క‌డ ఉంటుందో తెలిపే బ్యాలెట్ న‌మూనాలు కూడా సిద్ధం అయ్యాయి.. ఈ బ్యాలెట్‌కు విస్తృతంగా …

Read More »

అంద‌రి ప్రార్ధ‌న‌లు ఫ‌లించాయి.. జ‌న‌సేనాని సేఫ్‌..

న‌టుడిగా స్వ‌ర్గ సుఖాలు ఆయ‌న సొంతం.. కోట్లాది రూపాయిల సంపాద‌న‌.. ఇంటి నుంచి కాలు బ‌య‌టికి క‌దిపితే సెవెన్ స్టార్ హోట‌ళ్ల‌లో విడిది.. ఇవ‌న్నీ వ‌దులుకుని అతి సామాన్య జీవితం.. నుల‌క మంచం మీద ప‌డ‌క‌.. మ‌ట్టి పాత్ర‌లో భోజ‌నం.. అదీ పెరుగ‌న్నంతో జొన్న కూడు.. ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డి.. చెట్ల కింద కూర్చుని భోజ‌నం.. దాదాపుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద‌ పోరాట యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఇదే దిన …

Read More »

విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయ కోట‌లు బ‌ద్ద‌ల‌య్యేనా..? స‌త్తిబాబుతో ఢీ అంటున్న ముక్కా..

ఢీ అంటే ఢీ అంటున్న ముక్కా: విశాఖ‌ప‌ట్నం జిల్లాలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం స‌మ‌ర శంఖం పూరించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అక్క‌డ ఒక మాట చెప్పారు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయాల్లో మార్పు కోసం బొత్స మొగుడ్ని పంపుతున్నాన‌ని.. ఏళ్ల త‌ర‌బ‌డి కుటుంబాల పాల‌నలో జిల్లా వాసులు న‌లిగిపోతూ వ‌స్తున్నారు. అధికార బ‌లం, అంగ‌బ‌లం క‌లిగిన ఆ నాయ‌కులు జ‌నాన్ని భ‌య‌పెట్టి మ‌రీ ప‌బ్బం గ‌డుపుకుంటూ వ‌స్తున్నారు.. ప్ర‌జ‌లు, …

Read More »

క‌డ‌ప‌ కోట‌లో పాగా వేసేదెవ‌రు.? జ‌న‌సేన చ‌రిత్ర సృష్టించ‌నుందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు.. ఏలయినా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, తిరిగి అధికారం ద‌క్కించుకోవాల‌న్న ఆత్రుత‌తో ఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు కూడా వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి.. భార‌తంలో క‌ర్ణుడి చావుకు కార‌ణాలెన్నో ఉన్న‌ట్టు తెలుగు రాజ‌కీయాల్లో సెల్ఫ్ గోల్ స్పెష‌లిస్టుగా పేరున్న విప‌క్ష నేత ఓట‌మికి అన్నే కార‌ణాలు ప‌ని చేసేలా ఉన్నాయి.. ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది జ‌న‌సేన పార్టీకి ప్ర‌జ‌ల్లో …

Read More »

ముఖ్యమంత్రి పదవికి జ‌న‌సేనాని అన్ని విధాలా అర్హులు.. ప్ర‌జ‌ల ఆకాంక్ష అదేన‌న్న బెహ‌న్‌జీ..

కేంద్రంలో బీఎస్పీ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, కేంద్ర ప‌రిధిలోని విభ‌జ‌న హామీల‌న్నీ అమ‌లుచేస్తామ‌ని బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి హామీ ఇచ్చారు.. కాంగ్రెస్‌, బీజేపీల్లా వెనక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. బెజ‌వాడ న‌డిబొడ్డున జ‌న‌సేన పార్టీ, బీఎస్పీ సంయుక్తంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ఆమె., దేశ‌, రాష్ట్ర రాజ‌కీయాల‌పై., రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కూట‌మిని గెలిపించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌పై త‌న …

Read More »

ఏపీలో రెండు రోజుల పాటు మాయావ‌తి ప‌ర్య‌ట‌న‌. జ‌న‌సేన కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం..

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీకి జ‌న‌సేన పార్టీతో పొత్తు పెట్టుకున్న బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ, రెండు రాష్ట్రాల్లో ఎంపి సీట్ల‌తో పాటు ప‌లు ఎమ్మెల్యే స్థానాల‌ను ద‌క్కించుకుంది. జ‌న‌సేన‌, బీఎస్పీతో పాటు ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీలు కూట‌మిగా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌చిన నేప‌ధ్యంలో., వారి గెలుపు కోసం ప్ర‌చారం చేసేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ఏపీకి వ‌స్తున్నారు. రెండు రోజుల పాటు మూడు బ‌హిరంగ స‌భ‌ల్లో …

Read More »

ఉత్తరాంధ్ర భూములు పరాధీనం కానీయం.. సిక్కోలు స‌భ‌లో జ‌న‌సేనాని భ‌రోసా..

ఉత్త‌రాంధ్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దూసుకుపోతున్నారు.. అడుగుడుగునా ప్ర‌జ‌లు ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతుండ‌గా., పాల‌క వ‌ర్గాల నుంచి ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌తి ఒక్కరికీ జ‌న‌సేన పార్టీ అండ‌గా నిల‌బ‌డుతుంద‌న్న భ‌రోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.. ఆదివారం ప‌లాస‌, పాత‌ప‌ట్నం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు.. స్థానిక స‌మ‌స్య‌లు ప్ర‌స్థావిస్తూ, వాటికి ప‌రిష్కార మార్గాలు చూపుతూ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు.. ప్ర‌త్య‌ర్ధులు త‌న మీద …

Read More »

సాయంత్రం భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేనాని ప్ర‌జాయాత్ర‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారంతో వేగం పెంచారు.. తాను పోటీ చేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యేకంగా ప‌ర్య‌టించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న నివాసానికి ఇళ్లు తీసుకున్న ఆయ‌న‌., శ‌నివారం గాజువాక‌లో సుమారు 8 కిలోమీట‌ర్ల మేర ప్ర‌జా యాత్ర చేశారు.. గాజువాక‌కి ప్ర‌త్యేక మేనిఫెస్టోని కూడా ప్ర‌క‌టించారు.. ఇక ఆదివారం సాయంత్రం రెండో నియోజ‌క‌వ‌ర్గం భీమ‌వ‌రంలో రోడ్ షోకి రెడీ అయ్యారు.. శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న ముగించుకున్న …

Read More »