Home / ఎడిటోరియల్స్ / జనసేనాని జన్మదిన వేడుకలు చూసి ఓర్వలేని తనమే(ఏడుపే) ఈ ఫేక్ ప్రచారమా..?

జనసేనాని జన్మదిన వేడుకలు చూసి ఓర్వలేని తనమే(ఏడుపే) ఈ ఫేక్ ప్రచారమా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది జనసేన కార్యకర్తలకు పండుగ దినమే. తమ అభిమాన నాయకుడి జన్మదినోత్సవాన్ని వీధి వీధినా కేక్ కటింగ్ లతో సెలబ్రేట్ చేసుకోవడమే కాదు., ఆయన చల్లగా ఉండాలంటూ తమ నాయకుడు చూపిన బాటలో సేవా కార్యక్రమాలు చేపడుతూ సర్వత్ర ప్రశంసలు అందుకుంటున్నారు.. ఈ స్థాయిలో ఇన్ని లక్షల మంది స్వచ్ఛందంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చూసి కన్నుకుట్టిన కొందరు రాజకీయ ప్రత్యర్ధులు., వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు కూడా చేశారు.. కొన్ని చోట్ల పోలీసుల సాయంతో, ఒంకొన్ని చోట్ల వ్యతిరేక శక్తులతో జనసైనికులను భయభ్రాంతులకి గురిచేసే ప్రయత్నాలు చేశారు. ప్రతి చోటా వారి ప్రయత్నాలు బూమ్ రాంగ్(రివర్స్) కావడంతో  ఆ అక్కసును., ఆ ఏడుపును మరో రూపంలో తీర్చుకున్నారు. తమకు అలవాటు అయిన కుయుక్తులను ప్రయోగించేందుకు విఫలయత్నం చేశారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద ఓ ఫేక్ ప్రెస్ నోట్ రూపంలో జనసైనికులకి సందేశాన్నిస్తూ ఓ మోసపూరితమైన లేఖను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే ప్రయత్నం చేపట్టారు..

ఫేక్ లేఖపై పార్టీ సీరియస్..

జనసేన అధినేత మీద వచ్చిన మోసపూరితమైన లేఖను పార్టీ సీరియస్ గా తీసుకుంది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.. ఇలాంటి తప్పుడు లేఖ సృష్టించి ప్రచారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందనీ., ఈ లేఖ మోసపూరితం అని వెల్లడించింది. ఇలాంటి పుకార్లు నమ్మవద్దంటూ అంటూ పార్టీ శ్రేణులకి సూచించింది.. ఇలాంటి లేఖలు ప్రచారం చేసే వారిపై కేసులు దాఖలు చేసి., ప్రచారం చేస్తు వారిపై లీగల్ గా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు వెల్లడించింది.. పార్టీ లీగల్ విభాగం అందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. జనసేన అధినేత నిరంతరం ప్రజలకు చేరువగా ఉండి ప్రజల పక్షాన నిలడడాన్నే తన బాధ్యతగా నమ్ముతారని., అందుకు అనుగుణంగానే  నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న విషయాన్ని పార్టీ వర్గాలు ఆ ప్రకటనలో గుర్తు చేశాయి.

Share This:

1,392 views

About Syamkumar Lebaka

Check Also

అమరావతి గొడవని దారిమళ్లిస్తున్నారా.? రౌడీ రాజ్యం స్థాపనకు బాటలు వేస్తున్నారా..? కాకినాడ రణరంగం వెనుక స్కెచ్ ఏంటి.?

కాకినాడ జనసైనికులపై దాడి ఘటనలో పోలీసుల తీరు పట్ల సర్వత్ర విమర్శల పాలవుతోంది. తాము ఇచ్చిన భూములు కోసం నిరసన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + 5 =