Home / జన సేన / ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా ఓ సాంఘీక నాటక ప్రదర్శనలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించినందుకు దుర్గి ఎస్సై గ్రామస్తుల మీద దాడి చేసిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.. దుర్గి మండలం  ధర్మవరం గ్రామం ఒక పోలీస్ ఉద్యోగి అనాలోచిత, విచక్షణారహిత, పక్షపాత వ్యవహార శైలి కారణంగా ఆ గ్రామం అశాంతితో అల్లాడిపోతోందన్న విషయాన్ని ప్రస్థావించారు.. ధర్మవరం గ్రామంలో ఉన్న చాలా మంది పురుషులు పోలీస్ భయం కారణంగా గ్రామం వదిలి ఇతర ప్రాంతాలలో తలదాచుకోవలసిన దురదృష్టకర పరిస్థితిని పోలీసులు సృష్టించారని ఆరోపించారు.. శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులే అశాంతికి కారణమైతే ప్రజలు ఎవర్ని ఆశ్రయించాలి.? అని ప్రశ్నించారు..  గ్రామంలో ఏటా జరిగే తిరునాళ్లలో ఆనందంగా సాంఘీక నాటకాన్ని  ప్రదర్శించడం పాపమా? ఆ నాటికలో జనసేన జెండాలు ప్రదర్శించడమే నేరమా.? నాటికను మధ్యలో బలవంతంగా ఆపేసే అధికారం ఆ పోలీస్ ఉద్యోగికి ఎవరిచ్చారు? అంటూ నిలదీశారు.. మంగళవారం పార్టీ కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఈ నాటక ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన పోలీసులే  ప్రశ్నించిన మహిళలను నెట్టివేయమని (మాన్ హ్యాండ్లింగ్) ఏ చట్టం చెబుతోందంటూ ఖాకీల తీరుని దుయ్యబట్టారు..

లాఠీలతో కొట్టడానికి ఆ అధికారికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.. ఆడవారిపై దౌర్జన్యం చేసి గ్రామస్తులను రెచ్చగొట్టిన పోలీసుపై తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.. అక్రమంగా అరెస్టు చేసిన  జనసేన కార్యకర్తలు నాగేశ్వర రావు, బి.రమేష్ లను తక్షణం విడుదల చేయాలని కోరారు.. మరో 32 మందిపై పెట్టిన అక్రమ కేసులను రద్దు అధికారులను డిమాండ్ చేశారు..

ఎవరు ఎలా  రెచ్చగొట్టినా, ఎవరు దూషించినా శాంతియుతంగానే సమాధానం చెబుదాం అంటూ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.. ఇలాంటి వ్యవహారాల్లో విషయాలలో జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.. బాధితులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

Share This:

438 views

About Syamkumar Lebaka

Check Also

సైనిక కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన జనసేనాని..

సైనిక కుటుంబాల సంక్షేమార్ధం తనవంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముందుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + ten =