Home / జన సేన / ఆంధ్రులకు మిగిలింది అనిశ్చితి, అశాంతి, అభద్రతే-జనసేనాని

ఆంధ్రులకు మిగిలింది అనిశ్చితి, అశాంతి, అభద్రతే-జనసేనాని

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన గందరగోళాన్ని పొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం శాసనసభ శీతాకాల సమావేశాలు ముగించింది.. సమావేశాల మధ్యన అమరావతే రాజధాని అన్న మంత్రి బొత్స, మరుసటి రోజే తూచ్ అనగా., చివరి రోజు స్వయానా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ మరోసారి తన పాలనా మార్క్ ను గుర్తు చేశారు.. వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఘాటుగా స్పందించారు.. తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే… కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట అన్న సాముతను ఉదహరించిన జనసేనాని., ఒక్క అమరావతి రాజధానికే ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదని., మరి జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. పాలకులు వలన, రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమీ ఒరిగింది లేదంటూ మండిపడ్డారు.

కమిటీ రిపోర్ట్ రాక ముందే జగన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించేకాడికి, అసలు కమిటీలు వెయ్యడం ఎందుకంటూ నిలదీశారు.. నిపుణుల్ని అపహాస్యం చెయ్యటం దేనికని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

నాడు ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఇదేనా? అంటూ ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నావళిని సంధించారు. కేంద్రం అమరావతిని గుర్తించి మ్యాప్ లో మార్పు చేసిందనీ., ఇప్పుడు ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలో చెప్పాలంటూ ప్రశ్నించారు.

హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలుకి వెళ్లలా? అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్ళి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు లేదా సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా? అంటూ వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు..

Share This:

281 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 16 =