Home / జన సేన / జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా శివశంకర్..

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా శివశంకర్..

జనసేన పార్టీ మరో ప్రధాన కార్యదర్శిని ప్రకటించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నేత తమ్మిరెడ్డి శివశంకర్ ను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి తోట చంద్ర శేఖర్ కొనసాగుతున్నారు. తాజా నియామకంతో పార్టీ ప్రధాన కార్యదర్శుల సంఖ్య రెండుకు చేరింది. సోమవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ శివశంకర్ కు నియామక పత్రాన్ని అందచేశారు. విశాఖపట్నంలో చేపట్టిన లాంగ్ మార్చ్ అనంతరం శివ శంకర్ పార్టీపరంగా ముఖ్య బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఆ క్రమంలోనే ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

నరనరాన అంబేడ్కర్, ఫూలే సిద్ధాంతాల భావజాలం..

తమ్మిరెడ్డి శివశంకర్ 2018లో ప్రభుత్వ అధికారిగా స్వచ్ఛంద పదవి విరమణ చేసి జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన తొలుత హైడ్రో జియాలజిస్ట్ గా పని చేశారు. 1995లో గ్రూప్ 1కు ఎంపికై వాణిజ్య పన్నుల శాఖలో పలు ముఖ్య బాధ్యతల్లో విధులు నిర్వర్తించారు. అంబేడ్కర్, ఫూలే సిద్ధాంతాలతో ప్రభావితమైన శివశంకర్ శ్రీకాకుళంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచన విధానాలకు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకొంటూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా ఉన్నారు..

“ఇది పదవిని కిరీటంగా కాక కాదు బాధ్యతగా భావిస్తానని ఈ సందర్భంగా శివశంకర్ స్పష్టం చేశారు.. పార్టీలో నిబద్ధతతో కష్టపడి పని చేసేవారిని అధినేత గుర్తిస్తారు అనడానికి తానే ఉదాహరణ అని తెలిపారు. తనకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన జనసేనానికి కృతజ్ఞతలు తెలిపారు..

Share This:

408 views

About Syamkumar Lebaka

Check Also

సైనిక కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన జనసేనాని..

సైనిక కుటుంబాల సంక్షేమార్ధం తనవంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముందుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − 5 =