Home / ఎడిటోరియల్స్ / లాంగ్ మార్చ్ పై తప్పుడు ప్రచారాల వెనుక ఆంతర్యం ఏంటి.?

లాంగ్ మార్చ్ పై తప్పుడు ప్రచారాల వెనుక ఆంతర్యం ఏంటి.?

అనుమతులు లేవంటూ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు?

 జనసేన శ్రేణుల్ని భయపెట్టే ప్రయత్నమా.?

 గందరగోళం సృష్టించే ప్రయత్నమా.?

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో ఈ ఆదివారం జనసేనాని నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ కి అనుమతులు లేవంటూ మీడియాలో హల్ చల్ చేసిన వార్తలు అటు జనసైనికులను, ఇటు భవన నిర్మాణ కార్మికులను గందరగోళానికి గురిచేశాయి. భారత రాజ్యాంగాన్ని గౌరవించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చట్టానికి లోబడే తన కార్యకలాపాలు చేస్తూ వచ్చారు. తన వద్దకు వచ్చిన సమస్యపై నిబద్దతతో పోరాటం చేసే జనసేనాని.,  ప్రత్యర్ధి రాజకీయ నాయకుల మాదిరి మీడియాలో నానేందుకు అడ్డదిడ్డంగా మాట్లాడడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం ఎరుగరు. ఐదు సంవత్సరాల జనసేన పార్టీ చరిత్రలో శాంతియుత నిరసనలు చేపట్టినా, సభలు, సమావేశాలు పెట్టినా ముందస్తు అనుమతులు లేకుండా చేసిందీ లేదు. అలాంటి జనసేన పార్టీ 35 లక్షల మంది కార్మికుల వెతలపై ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చేందుకు చేపట్టిన లాంగ్ మార్చ్ కి అనుమతులు తీసుకోలేదంటే అది నమ్మసక్యమైన విషయం కాదు. కానీ మీడియాలో వచ్చిన వార్తలతో లాంగ్ మార్చ్ లో పాల్గొనేందుకు బయలుదేరిన జనసేన శ్రేణుల్లోనూ, భవన నిర్మాణ కార్మికుల్లోనూ ఒకింత గందరగోళం నెలకొంది. అనుమతులు లేకపోతే మనల్ని విశాఖ వెళ్లనిస్తారా? తీరా వెళ్లాక పోలీసులు శాంతియుతంగా చేపట్టే నిరసనను సాగనిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి..

అయితే ఇలాంటి వార్తలు వచ్చిన కాసేపటికే విశాఖ పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని జనసేనాని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి ఈ ఊహాగానాలకు తెరదించాల్సి వచ్చింది. ఇక్కడ గమనించదగిన అసులు మేటర్ ఇంకొకటి ఉంది. ఉదయం నుంచి జనసేన లాంగ్ మార్చ్ కి అనుమతులు లేవు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నా., లాంగ్ మార్చ్, సభ నిర్వహించే ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాట్లు చేసుకోకుండా అడ్డుకుంటున్నా., ఏ ఒక్క పోలీసు ఉన్నతాదికారి ఆ వార్తలను ఖండించింది లేదు. జనసేన అధినేత ఎప్పుడైతే అనుమతి పత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ కాసేపటికే అనుమతి ఇచ్చిన ఏసీపీ మీడియా ముందుకు వచ్చి తామే ఆ అనుమతి ఇచ్చామని ఒప్పుకున్నారు.

ఇసుక వ్యవహారంలో అతిగా ప్రవర్తించి 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నోటి కాడ కూడు తీయడంతో పాటు నేరాన్ని వరద మీదకి నెట్టే ప్రయత్నం చేసిన వైసిపి సర్కారు., ఇప్పుడు జనసేన రూపంలో ముంచుకువస్తున్న ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలో అర్ధం కాక తలలు పట్టుకుంటోంది. లాంగ్ మార్చ్ ని ఎలాగైనా చెడగొడితే ఈ సారికి చావుతప్పుతుంది అన్న ఆలోచనతో ఖాకీలు, అనుంగ మీడియా సాయంతో అనుమతులు లేవు అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. జనసేనాని ట్వీట్ తో ఆ పన్నాగం కాస్త బెడిసికొట్టడంతో., కన్నబాబు లాంటి మంత్రులు సూక్తి పురాణాలు మొదలుపెట్టారు. వరద నీటిలో నుంచి ఇసుక ఎలా తియ్యాలో పవన్ కళ్యాణే చెప్పాలంటూ వీరంగాలు మొదలు పెట్టారు.. వరద నీటిలో ఇసుక తియ్యడం కష్టమని తెలిసిన గౌరవనీయులైన మంత్రి వర్యులకు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి వచ్చేది వర్షాకాలం అని, ముందు జాగ్రత్త లేకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయని తెలియదా? అని జనం ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల్లో కొత్త పాలసీ తెస్తామని 100 రోజుల పాటు సాగదీయడం మీ వైఫల్యం కాదా అని ఉపాధి కోల్పోయిన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.. వారు సమాధాన పరచాల్సింది ఆ ప్రజలను గానీ, ప్రజల తరఫున ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా పోరాటం చేస్తున్న జనసేన అధినేతను విమర్శించడమేంటో అర్ధం కావడం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి చౌకబారు విమర్శలు ప్రజా వ్యతిరేకతను పొగోట్టకపోగా., గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టే ప్రమాదమూ ఉంది.. చేతిలో 151 సీట్లు ఉన్నాయి కదా అన్న మిడిసిపాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలాంటి ప్రభావం చూపుతాయో కళ్లకు కట్టిన ఘటనలు కోకొల్లలు.. ప్రజల మద్దతుతో చేసే పోరాటాల గురించి ఆలోచించడం మాని., ప్రజా వ్యతిరేకత ఎలా తగ్గించుకోవాలన్న అంశంపై దృష్టి సారించడం మంచిదన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోంది..

Share This:

734 views

About Syamkumar Lebaka

Check Also

అమరావతి గొడవని దారిమళ్లిస్తున్నారా.? రౌడీ రాజ్యం స్థాపనకు బాటలు వేస్తున్నారా..? కాకినాడ రణరంగం వెనుక స్కెచ్ ఏంటి.?

కాకినాడ జనసైనికులపై దాడి ఘటనలో పోలీసుల తీరు పట్ల సర్వత్ర విమర్శల పాలవుతోంది. తాము ఇచ్చిన భూములు కోసం నిరసన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × three =