Home / ఎడిటోరియల్స్ / అమరావతి గొడవని దారిమళ్లిస్తున్నారా.? రౌడీ రాజ్యం స్థాపనకు బాటలు వేస్తున్నారా..? కాకినాడ రణరంగం వెనుక స్కెచ్ ఏంటి.?

అమరావతి గొడవని దారిమళ్లిస్తున్నారా.? రౌడీ రాజ్యం స్థాపనకు బాటలు వేస్తున్నారా..? కాకినాడ రణరంగం వెనుక స్కెచ్ ఏంటి.?

కాకినాడ జనసైనికులపై దాడి ఘటనలో పోలీసుల తీరు పట్ల సర్వత్ర విమర్శల పాలవుతోంది. తాము ఇచ్చిన భూములు కోసం నిరసన తెలుపుతున్న అమరావతి రైతుల పట్ల చూపుతున్న కాఠిన్యంలో., కనీసం పదో వంతు కూడా పట్టపగలు నడిరోడ్డు మీద అసాంఘీక శక్తులుగా మారణాయుధాలతో చెలరేగిపోతున్న వైసీపీ గూండాలపై చూపలేకపోవడం మొత్తం వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా చేస్తోంది.. మారణాయుధాలతో దాడులకు తెగబడిన వారిని వదిలేసి., దాడుల్లో దెబ్బలు తిన్న వారి  మీదే ఎదురు కేసులు నమోదు చేయడం వెనుక ఆంతర్యం ఏంటో పోలీస్ బాస్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఉద్దేశపూర్వక దాడేనని., అధికార పార్టీయే చేయిస్తోందన్నది సుస్పష్టం. ద్వారంపూడి వ్యాఖ్యల నుంచి అన్ని పరిణామాలు ఓ పథకం ప్రకారం జరిగినవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మూడు రాజధానుల ప్రకటన అనంతరం రాజధాని గ్రామాల్లో నిరసనలు హోరెత్తుతున్నా ప్రభుత్వం వెనుకడుగు వేసే పరిస్థితి కనబడడం లేదు. దీంతో గత నాలుగైదు రోజులుగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి.. రైతులు, మహిళలపై పోలీసుల లాఠీలు విరుగుతున్నా., పోరాటం నుంచి ఒక్కరు కూడా వెనుకడుగు వేయడం లేదు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఉద్యమ నిర్మాణంలో తమవంతు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఈ నేపధ్యంతో సమాతంరంగా మరో గొడవ సృష్టిస్తే తప్ప జనసైనికులు, జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టిని మళ్లించడం సాధ్యం కాదన్న విషయం ప్రభుత్వానికి అర్ధం అయిపోయింది. కాకినాడ వ్యూహం అమలు చేయడం వెనుక అసలు కారణం అదేనన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

జనసైనికుల మీద ఈగ వాలినా సహించని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా కాకినాడ దాడులకు వైసీపీ అధిష్టానం స్క్రీన్ ప్లేని రూపొందించినట్టు తెలుస్తోంది. దాడులు చేయించేందుకు ద్వారంపూడి ఏకంగా కడప నుంచి కాకినాడకు రాత్రికి రాత్రి రౌడీలను దించారన్నది స్థానికంగా టాక్.. దాడుల్లో గాయపడిన జనసేన స్థానిక నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడింది తమ ప్రాంతానికి చెందిన వారు కాదని, వారు బయట నుంచి వచ్చిన వారేనని చెప్పడం ఈ వాదనలకు బలాన్నిస్తోంది.

ఘటన అనంతరం వైసీపీ రౌడీల చేతిలో దెబ్బలు తిన్న జనసేన నాయకులు, కార్యకర్తల మీద ఎదురు కేసులు పెట్టడం, అదీ నాన్ బెయిల్ కేసులు పెడతామని బెధిరించడం వెనుక ఉద్దేశం కూడా కాకినాడకు పవన్ కళ్యాణ్ ని రప్పించాలన్నదే అయివుండ వచ్చని చెబుతున్నారు.. పవన్ కళ్యాణ్ కాకినాడకు వస్తే… ఆదివారం జరిగిన దాడుల నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులంతా అక్కడికి తరలివస్తారు.. కాకినాడ గొడవను పెద్దదిగా చిత్రించి., రాజధాని తరలింపు అంశంపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించవచ్చు అన్నది ప్రభుత్వ పన్నాగం. అందుకే అర్ధరాత్రి అరెస్ట్ చేసిన వారిని వదిలేసినా, కేసులు అలాగే ఉంచినట్టు సమాచారం.

అయితే ఇక్కడ వైసీపీ నాయకులు గుర్తించని అంశం ఏమంటే, కాకినాడలో జరిగిన చిన్న విషయాన్ని పెద్దది చేసేందుకు కడప నుంచి రౌడీలను తెప్పించిన వైసీపీ నేతలు, విశాఖ ప్రజల మనసుల్లో  రాజధాని మీద వ్యతిరేకతను నాటామన్న విషయాన్ని గ్రహించకపోవడం గమనార్హం. కాకినాడ ప్రశాంతతను పారద్రోలుతూ రౌడీ రాజ్యస్థాపనకు జగన్ రెడ్డి అడుగులు వేశారని జనం దుమ్మెత్తి పోస్తున్నారు.. రాజధాని తమ ప్రాంతానికి వస్తే వీరి అరాచకాలు  ఏ స్థాయిలో ఉంటాయోనన్న భయాందోళనలు విశాఖ వాసుల్లో మొదలయ్యాయి.. పవన్ కళ్యాణ్ ని కాకినాడ రప్పించి అమరావతిని సైడ్ ట్రాక్ పట్టించామని సంతోషపడతారో? లేక విశాఖ వాసుల మనసుల్లో అనుమాన భీజాలు నాటి సెల్ఫ్ గోల్ వేసుకున్నందుకు వైసీపీ నేతలు తలలు పట్టుకుంటారో చూడాలి.. ఎంతయినా జగన్ రెడ్డి సెల్ఫ్ గోల్ స్పెషలిస్టు కధా..!

Share This:

277 views

About Syamkumar Lebaka

Check Also

వైసీపీది దారితప్పిన రాజకీయమా.? దారిమళ్లింపు రాజకీయమా.?

ఓ చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీతకు కనుమరుగవుతుంది. వారి చర్యలతో ప్రజలను సమస్యల్లోకి నెట్టే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen + 15 =