Home / జన సేన / ప్ర‌జ్వ‌రిల్లిన హోదా స్ఫూర్తి.. అఖిల‌ప‌క్షంతో క‌ల‌సి బంద్‌ను విజ‌య‌వంతం చేసిన జ‌న‌సైన్యం..

ప్ర‌జ్వ‌రిల్లిన హోదా స్ఫూర్తి.. అఖిల‌ప‌క్షంతో క‌ల‌సి బంద్‌ను విజ‌య‌వంతం చేసిన జ‌న‌సైన్యం..

ప్ర‌త్యేక హోదా సాధ‌న కాంక్ష ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో రోజు రోజుకీ బ‌ల‌ప‌డుతోంది.. ప్ర‌త్యేక హోదా భిక్ష కాదు, ఐదు కోట్ల ఆంధ్రుల హ‌క్కు అనే నినాదంతో, ద‌శాబ్దాల అనుభ‌వ‌మున్న పార్టీల‌కి కేంద్రంపై ఎలా పోరాటం చేయాలో నేర్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ప్ర‌త్యేక త‌ర‌గ‌తి హోదా సాధ‌న కోసం పోరాటం చేసే ఎవరికైనా మ‌ద్ద‌తు తెలిపేందుకు ముందుకి వ‌చ్చారు.. ఆ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు సోమ‌వారం రాష్ట్ర బంద్‌కు జ‌న‌సేన పార్టీ త‌రుపున మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర తీరుకి నిర‌స‌న‌గా బంద్‌కి పిలుపు నివ్వ‌గా, అఖిల‌ప‌క్షం-జ‌న‌సేన సై అన్నాయి.. దీంతో ఉద‌యం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారుల‌న్నీ నిర్మానుష్యంగా మారాయి..

బంద్‌లు, ధ‌ర్నాల‌తో ప్ర‌జ‌ల‌ని ఇబ్బంది పెట్ట‌డం జ‌న‌సేన పార్టీ సిద్ధాంతం కాకున్నా, ప్ర‌త్యేక హోదా అనేది ప్ర‌తి ఆంధ్రుడి హ‌క్కు.. ఆ హ‌క్కు సాధించే క్ర‌మంలో చిన్న పాటి ఇబ్బందుల‌ని ప్ర‌జ‌లు స్వీక‌రిస్తార‌న్న న‌మ్మ‌కంతో జ‌న‌సేనాని త‌న సైన్యాన్ని రోడ్ల మీదికి ర‌మ్మ‌ని పిలుపు నిచ్చారు.. పార్టీ అధినేత పిలుపుతో అఖిల‌ప‌క్షం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఉద‌యం నుంచే జెండాల‌తో రోడ్ల‌పైకి వ‌చ్చారు.. ఆర్టీసీ డిపోల ముందు, ర‌హ‌దారుల ప్ర‌ధాన కూడళ్ల‌లోనూ బైఠాయించారు.. దీంతో జ‌న‌జీవ‌నం దాదాపు స్థంభించింది..

అనంత‌రం జ‌న‌సేన జెండాల‌తో ర‌హ‌దారుల వెంట ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ నినాదాలు చేశారు.. ప్ర‌జ‌లంతా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో భాగ‌స్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల పిలుపుతో ప‌లు చోట్ల ప్ర‌జ‌లు కూడా స్వ‌చ్చందంగా అఖిల‌ప‌క్షంతో క‌ల‌సి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్నారు..

ఉత్త‌రాంధ్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తి, రాయ‌ల‌సీమ‌ల్లో బంద్ ప్ర‌భావం తీవ్రంగా క‌నిపించింది.. ఎక్క‌డా డిపోల నుంచి బ‌స్సులు బయ‌టికి రాలేదు.. సాయంత్రం వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీదుగా వెళ్లే జాతీయ ర‌హ‌దారులు కూడా వాహ‌నాల రాక‌పోక‌లు నిల‌చిపోయి ఏడారిలా ద‌ర్శ‌న‌మిచ్చాయి.. త‌మ పార్టీ అధినేత అనుమ‌తి ఇస్తే రాత్రింభ‌వ‌ళ్లు రోడ్ల‌పైనే ఉండేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.. హోదా సాధించే వ‌ర‌కు వెన‌కడుగు వేసే ప్ర‌స‌క్తే లేదంటూ ప్ర‌తిన బూనారు.. పార్టీ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి..

Share This:

492 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × two =